పెళ్లి చేసే స్తోమత లేక బాలికను రాజస్థాన్ వాసికి అమ్మే యత్నం
ABN , First Publish Date - 2021-02-06T16:04:18+05:30 IST
మహబూబ్‌నగర్ : పెళ్లి చేసే స్తోమత లేక 17 ఏళ్ల బాలికను రాజస్థాన్ వాసికి అమ్మే యత్నం జరిగింది.

మహబూబ్‌నగర్ : పెళ్లి చేసే స్తోమత లేక 17 ఏళ్ల బాలికను రాజస్థాన్ వాసికి అమ్మే యత్నం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట మండలం హజిలాపూర్ గ్రామ పరిధిలోని గాలిలోని కుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు బాలిక బంధువు ఒకరు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు దీనిని అడ్డుకొని అమ్మాయిని స్టేట్ హోమ్‌కు తరలించారు.