కేసీఆర్‌ను కలిసిన పల్లా.. అభినందించిన సీఎం

ABN , First Publish Date - 2021-03-22T08:04:04+05:30 IST

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ శాసనమండలి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలిసారు.

కేసీఆర్‌ను కలిసిన పల్లా.. అభినందించిన సీఎం

హైదరాబాద్‌, మార్చి 21 (ఆంద్రజ్యోతి): నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ శాసనమండలి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా పల్లాను కేసీఆర్‌ అభినందించారు. సీఎంను కలిసిన వారిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, జడ్పీ చైర్మన్లు సుధీర్‌ కుమార్‌, పాగాల సంపత్‌రెడ్డ్డి తదితరులున్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌(హైదరాబాద్‌) నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందిన సురభి వాణీదేవి, పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు శనివారం సాయంత్రమే సీఎంను కలిసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-03-22T08:04:04+05:30 IST