పచ్చదనానికి విశ్వవేదికగా పాలమూరు

ABN , First Publish Date - 2021-08-21T08:14:17+05:30 IST

పాలమూరు జిల్లా పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

పచ్చదనానికి విశ్వవేదికగా పాలమూరు

ఆగస్టు 20:  పాలమూరు జిల్లా పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సాగునీటి జలాలతో ఈ జిల్లా నేడు ఎటు చూసినా పచ్చని పంటలతో కనువిందు చేస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో వలసలు, ఆకలి చావులు, బీడు భూములకు నిలయమైన ఈ జిల్లా..  తన రూపు రేఖలను మార్చుకుని, స్వయం పాలనలో ఎంతో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో సీడ్‌ బాల్స్‌ను రికార్డు స్థాయిలో తయారు చేసి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా వెదజల్లిన విషయం తెలిసిందే. అలాగే సీడ్‌ బాల్స్‌తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన ‘గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డు’ జ్జాపికను శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ఎంపీ సంతోష్‌ కుమార్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌లు అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వారి కృషిని అభినందించారు. కొండలు, గుట్టల ప్రాంతాల్లో సీడ్‌ బాల్స్‌ను వెదజల్లడం ద్వారా పచ్చదనం కోసం పాటుపడుతున్న పాలమూరు జిల్లా మహిళా సంఘాల కృషిని ఆయన అభినందించారు.

Updated Date - 2021-08-21T08:14:17+05:30 IST