రాష్ట్రంలోనే మోర్తాడ్ పీహెచ్‌సీలో తొలి ఆక్సిజన్ ప్లాంట్లు: ప్రశాంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-08-26T00:07:55+05:30 IST
రాష్ట్రంలోనే తొలి ఆక్సిజన్ ప్లాంట్‌ను నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో ఏర్పాటు చేసినట్టు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

నిజామాబాద్: రాష్ట్రంలోనే తొలి ఆక్సిజన్ ప్లాంట్‌ను నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో ఏర్పాటు చేసినట్టు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రూ.కోటి 54లక్షల వ్యయంతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్, బాట్లింగ్ ప్లాంట్‌లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కరోనా సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్‌లు లభించక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎంతో బాధ కలిగించాయని అన్నారు. దీంతో రానున్న కాలంలో ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు తన మిత్రులతో కలిసి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ వల్ల రోజుకు 50 సిలిండర్‌లను నింపుకొని అవసరమైన అన్ని ఆసుపత్రులకు సరఫరా చేసే విధంగా పూర్తిస్థాయిలో తీర్చిదిద్దామని ప్రశాంత్‌రెడ్డి వివరించారు.