టీయూలో 113 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు రద్దు

ABN , First Publish Date - 2021-10-31T08:39:53+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ)లో వివాదాస్పదంగా మారిన ఔట్‌సోర్సింగ్‌ పోస్టులను రద్దు చేశారు....

టీయూలో 113 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు రద్దు

రిజిస్ట్రార్‌ కనకయ్య తొలగింపు

డిచ్‌పల్లి, ఆక్టోబరు 30: తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ)లో వివాదాస్పదంగా మారిన ఔట్‌సోర్సింగ్‌ పోస్టులను రద్దు చేశారు. ఈ పోస్టుల భర్తీలో అవకతవకలపై ఈసీకి సభ్యుల ఫిర్యాదు, విద్యార్థి సంఘాల ఆందోళన, వర్సిటీలో అవినీతిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరస కథనాల నేపథ్యంలో శనివారం నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని టీయూలో ఈసీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ హాజరై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలకమండలి, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇటీవల చేపట్టిన 113 ఔట్‌ సోర్సింగ్‌  పోస్టులను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో రిజిస్ట్రార్‌ కనకయ్యను విధుల నుంచి తొలగించి కామర్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ యాదగిరిని నియమించారు.

Updated Date - 2021-10-31T08:39:53+05:30 IST