పైరవీలు, లంచాలు లేని సర్కారు మాది

ABN , First Publish Date - 2021-06-22T07:33:31+05:30 IST

రాష్ట్రంలో పైరవీలు, లంచాలు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు.

పైరవీలు, లంచాలు లేని సర్కారు మాది

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు: హరీశ్‌రావు

సంగారెడ్డి/ముషీరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పైరవీలు, లంచాలు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా మనూర్‌ మండలం బోరంచలో సోమవారం బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ఏ పని కావాలన్నా పైరవీలు, లంచాలు ఉండేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా హరీశ్‌రావు  నివాళులర్పించారు. కాగా, బోరంచలో ప్రారంభించిన ఎత్తిపోతల పథకానికి బసవేశ్వర పేరు పెట్టినందుకు వీరశైవ లింగాయత్‌ ఫెడరేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్‌ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.  

Updated Date - 2021-06-22T07:33:31+05:30 IST