హైదరాబాద్ ఓయూలో విద్యార్థుల ఆందోళన
ABN , First Publish Date - 2021-03-25T03:12:43+05:30 IST
హైదరాబాద్ ఓయూలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూలో మూసివేసిన హాస్టళ్లను వెంటనే తెరిపించాలని ఎన్సీసీ చౌరస్తాలో రోడ్లపై బైఠాయించారు. విద్యార్థులపై కక్ష సాధింపు చర్య చేస్తున్నారంటూ ఎన్సీసీ గేటు వద్ద 200 మందితో రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.