ధరణిపై ఆదేశాలు సెప్టెంబరు 8దాకా పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-22T08:10:17+05:30 IST

ధరణి వెబ్‌ పోర్టల్‌పై దాఖలైన వ్యాజ్యాల్లో గతంలో హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఆదేశాలను హైకోర్టు సెప్టెంబరు 8వరకు పొడిగించింది.

ధరణిపై ఆదేశాలు సెప్టెంబరు 8దాకా పొడిగింపు

కౌంటర్‌, రిప్లై కౌంటర్లు వేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):  ధరణి వెబ్‌ పోర్టల్‌పై దాఖలైన వ్యాజ్యాల్లో గతంలో హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఆదేశాలను హైకోర్టు సెప్టెంబరు 8వరకు పొడిగించింది. ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదు కోసం ఆధార్‌ సంఖ్య, కులం, కుటుంబ సభ్యుల వివరాలు కోరడాన్ని ప్రశ్నిస్తూ న్యాయవాది కాశీభట్ల సాకేత్‌, గోపాల్‌ శర్మ వాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే హిమా కోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఈ ఏడాది జనవరిలో తాము ఆదేశించినా, ఇంకా కౌంటర్‌ ఎందుకు వేయలేదని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా కౌంటర్లు,రిప్లయ్‌ కౌంటర్లు వేయాలని ధర్మాసనం  వాది ప్రతివాదులను ఆదేశించింది. 

Updated Date - 2021-06-22T08:10:17+05:30 IST