14 నుంచి ఓపెన్‌ స్కూల్‌ ప్రయోగ పరీక్షలు

ABN , First Publish Date - 2021-01-12T09:40:07+05:30 IST

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) సెకండరీ(10వ తరగతి), సీనియర్‌ సెకండరీ(12వ తరగతి) పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు

14 నుంచి ఓపెన్‌ స్కూల్‌ ప్రయోగ పరీక్షలు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) సెకండరీ(10వ తరగతి), సీనియర్‌ సెకండరీ(12వ తరగతి) పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 14 నుంచి 25 వరకు జరుగుతాయి. థియరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తారు. పరీక్షల షెడ్యూల్‌, ప్రయోగ పరీక్షల హాల్‌ టికెట్లు వెబ్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు అనిల్‌కుమార్‌ తెలిపారు. సమాచారం కోసం హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రంలోని ఫోన్‌ నెంబర్లు 040-24750712, 040-24752859లలో సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2021-01-12T09:40:07+05:30 IST