25నుంచి ఓపీ సేవలు బంద్‌

ABN , First Publish Date - 2021-10-20T05:08:07+05:30 IST

25నుంచి ఓపీ సేవలు బంద్‌

25నుంచి ఓపీ సేవలు బంద్‌

హనుమకొండ అర్బన్‌, అక్టోబరు 19: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్న జూనియర్‌ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25వ తేదీనుంచి డీఎంఈ పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేయనున్నట్లు జూనియర్‌ డా క్టర్ల ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలోని క్యాజువాలిటీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సేవలందిస్తున్న జూనియర్‌ వైద్యులకు స్టయిఫండ్‌ అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. స్టయిఫండ్‌ విషయంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడం వల్లనే సమ్మెబాట పట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2021-10-20T05:08:07+05:30 IST