ప్లాస్టిక్‌ నివారణపై ఆన్‌లైన్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-10-07T05:58:26+05:30 IST

ప్లాస్టిక్‌ నివారణపై ఆన్‌లైన్‌ పోటీలు

ప్లాస్టిక్‌ నివారణపై ఆన్‌లైన్‌ పోటీలు

డీఈవో డి.వాసంతి 

వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 6: తెలంగాణ రాష్ట్ర నేషనల్‌ గ్రీన్‌కోర్‌, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సింగ్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నివారణ పై అంతర్జాల పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో డి.వాసంతి తెలిపారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌పై భారత్‌ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 300 పదాలకు మించని వ్యాసరచన పోటీలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు ఏ-4 సైజ్‌ పేపర్‌ను ఉపయోగించి లింక్‌ ద్వారా లాగిన్‌ అయి పాల్గొనాలని కోరారు. ఈనెల7 నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పోటీలు నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ను 98488 78455 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.  

Updated Date - 2021-10-07T05:58:26+05:30 IST