జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరోసారి కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-03-24T16:19:43+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో తిరిగి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేశాయని అంతా భావిస్తున్న తరుణంలో

హైదరాబాద్: తెలంగాణలో తిరిగి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేశాయని అంతా భావిస్తున్న తరుణంలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరోసారి కరోనా కలకలం రేపింది. 5 వ అంతస్థులోని చీఫ్ ఇంజనీర్ (మేయింటనెన్స్) విభాగంలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 5వ అంతస్తులో సిబ్బందికి సెలవు ప్రకటించి బల్దియా అధికారులు శానిటైజ్ చేయించారు.