ఖమ్మంలో ఒమైక్రాన్ కేసు నమోదు.. యువతికి నిర్దారణ

ABN , First Publish Date - 2021-12-27T04:34:15+05:30 IST

రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఖమ్మం నగరంలో...

ఖమ్మంలో ఒమైక్రాన్ కేసు నమోదు.. యువతికి నిర్దారణ

ఖమ్మం: రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు  ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఖమ్మం నగరంలో ఒమైక్రాన్ కేసు నమోదు అయింది.  ఓ అపార్ట్ మెంట్‌లో యువతి‌కి ఒమైక్రాన్ నిర్దారణ అయింది. ఈ  19న యువతి హైదరాబాద్ నుంచి ఖమ్మం నగరానికి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమెతో కాంటాక్ట్ అయిన వారిని ప్రస్తుతం అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ఒమైక్రాన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని తెలిపారు. లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. 


Updated Date - 2021-12-27T04:34:15+05:30 IST