ఆయిల్‌పామ్ తోటల పెంపకానికి చర్యలు
ABN , First Publish Date - 2021-02-07T03:55:30+05:30 IST
ఆయిల్‌పామ్ తోటల పెంపకానికి చర్యలు

సౌత్ అమెరికా నుంచి మొక్కల దిగుమతి
అర్బన్, రూరల్ జిల్లాల ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి శ్రీనివా్‌సరావు
వరంగల్‌అర్బన్ అగ్రికల్చర్, ఫిబ్రవరి 6: వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలో ఆయిల్‌పామ్ తోటల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి ఆర్.శ్రీనివా్‌సరావు తెలిపారు. ఆయిల్‌పామ్ తోటల పెంపకంపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఆయిల్‌పామ్ మొక్కలేవి? అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఉద్యాన అధికారి స్పందించి ఒక ప్రకటన విడుదల చేశారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో కె.ఎన్ బయోసైన్స్(ఇండియా)ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 13,832 ఎకరాలు, వరంగల్ రూరల్ జిల్లాలో రామచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ వారికి 57,101 ఎకరాలు కేటాయిస్తూ ఉద్యానశాఖ ఈనెల 2న ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఖిలావరంగల్ మండలం, తిమ్మాపూర్‌లో నర్సరీ ఏర్పాటు చేసుకోడానికి కె.ఎన్ బయోసైన్స్ సంస్థకు లైసెన్స్ జారీ చేశామని తెలిపారు. సదరు కంపెనీ వారు నర్సరీలో కావాల్సిన పరికరాలు, వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. అయితే ఆయిల్‌పామ్ సీడ్‌ను ‘కోస్టారిక’(సౌత్ అమెరికా) నుంచి దిగుమతి చేసుకొనే యత్నంలో ఉన్నారని తెలిపారు. ఈ విత్తనాలు మార్చి, ఏప్రిల్ నెలల్లో విత్తిన తర్వాత నవంబరు, డిసెంబరు నెలలో రైతులకు రాయితీపై సరఫరా చేస్తారని వివరించారు. ఈ లోగా రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, విజ్ఞాన యాత్రలు చేపడతారని వివరించారు.
ఆసక్తి గల రైతులు సలహాలు, సూచనల కోసం పేర్లు నమోదు చేసుకోడానికి ఆయా మండలాల ఉద్యాన అధికారులను సంప్రదించాలని కోరారు. చెన్నారావుపేట, నెక్కొండ, నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, ఆత్మకూరు, దామెర, పరకాల, నడికూడ, శాయంపేట మండలాల రైతులు 79977 25088 నెంబరులో, రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం మండలాల రైతులు 79977 25086, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, కాజీపేట మండలాల రైతులు 79977 25089, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల రైతులు 79977 25415 నెంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.