నేడు ‘గోదావరి-కావేరి’ భేటీ

ABN , First Publish Date - 2021-10-29T08:12:21+05:30 IST

గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జలసౌధలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ

నేడు ‘గోదావరి-కావేరి’ భేటీ

హైదరాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జలసౌధలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగనుంది. ఎన్‌డీడబ్ల్యూఏ డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌సింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌తో పాటు ఈఎన్‌సీలు, ఎనిమిది రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. 

Updated Date - 2021-10-29T08:12:21+05:30 IST