ఈ విజయం సీఎం కేసీఆర్‌కు అంకితం : నోముల భగత్

ABN , First Publish Date - 2021-05-02T20:46:06+05:30 IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడంపై ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ విజయం సీఎం కేసీఆర్‌కు అంకితం : నోముల భగత్

హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడంపై ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని సీఎం కేసీఆర్‌కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తనను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు పాదాభివందనాన్ని ప్రకటించారు. గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. తండ్రి నోముల నర్సింహ్మయ్య ఆశయాలను తప్పకుండా నెరవేరుస్తానని, అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తానని నోముల భగత్ ప్రకటించారు. 

Updated Date - 2021-05-02T20:46:06+05:30 IST