‘విశాఖ’ రైల్వే జోన్‌ లేదు!

ABN , First Publish Date - 2021-12-09T07:35:59+05:30 IST

మరో విభజన హామీని కేంద్రం అటకెక్కించింది. విశాఖ కేంద్రంగా

‘విశాఖ’ రైల్వే జోన్‌ లేదు!

న్యూఢిల్లీ/విశాఖపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మరో విభజన హామీని కేంద్రం అటకెక్కించింది. విశాఖ కేంద్రంగా తానే ప్రకటించిన కొత్త దక్షిణ కోస్తా (సౌత్‌ కోస్టల్‌) రైల్వే జోన్‌ ఊసే లేకుండా చేసింది. దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయని బుధవారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. అందులో విశాఖ జోన్‌ కనిపించ లేదు. పైగా దేశంలో కొత్త రైల్వే జోన్‌ను మంజూరు చేసే అవకాశమే లేదని ఆయన సెలవిచ్చారు. 


Updated Date - 2021-12-09T07:35:59+05:30 IST