డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్ల ఆందోళనలు..

ABN , First Publish Date - 2021-10-31T09:18:20+05:30 IST

హుజూరాబాద్‌ మండలం జూపాకలో కొంత మంది మహిళలు ఓటరు స్లిప్పులతో పోలింగ్‌ కేంద్రం సమీపంలోకి వచ్చి.. తమకు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని,....

డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్ల ఆందోళనలు..

హుజూరాబాద్‌ మండలం జూపాకలో కొంత మంది మహిళలు ఓటరు స్లిప్పులతో పోలింగ్‌ కేంద్రం సమీపంలోకి వచ్చి.. తమకు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని, లేకపోతే ఇంటికి వెళ్తామని నిరీక్షించారు. ఓటుకు డబ్బులు ఎవరు ఇస్తే వారికే వేస్తామని తెగేసి చెప్పారు. ఎవరూ డబ్బులు ఇవ్వకపోవడంతో ఓటు వేయకుండానే వెళ్లిపోయారు. రంగాపూర్‌లో పలువురు.. తమకు డబ్బులివ్వడం లేదంటూ హుజూరాబాద్‌-జమ్మికుంట ప్రధాన రహదారి పక్కన ఉన్న పోలింగ్‌ బూత్‌ సమీపంలో నిరసన తెలిపారు. మరికొందరు ఓటుకు రూ.6 వేలకుగాను రూ.3 వేలు మాత్రమే ఇచ్చారంటూ ఆందోళన చేశారు. గంగారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ పంపిణీ చేసిన డబ్బులు తమకు అందలేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్‌ పట్టణంలో ఓ వ్యక్తి  ఓ కారులో నుంచి డబ్బులు పంచుతుండగా బీజేపీ నాయకులు గమనించి గొడవకు దిగారు. 

Updated Date - 2021-10-31T09:18:20+05:30 IST