విద్యుత్తు చార్జీలు పెంచట్లేదు: జగదీశ్‌ రెడ్డి

ABN , First Publish Date - 2021-03-21T08:44:22+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. శనివారం శాసనమండలిలో పశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.

విద్యుత్తు  చార్జీలు పెంచట్లేదు: జగదీశ్‌ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. శనివారం శాసనమండలిలో పశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ కాలంలో విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వచ్చాయనడం అవాస్తమన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని బిల్లులు ఎక్కువగా వచ్చిన మాట వాస్తవమేనని, వాటిని పరిశీలించి సరిదిద్దామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-21T08:44:22+05:30 IST