తెలంగాణపై ప్రభావం లేదు

ABN , First Publish Date - 2021-05-18T08:45:09+05:30 IST

తెలంగాణ రాష్ట్రంపై ‘తౌక్టే’ తుపాను ప్రభావం ఏమాత్రం లేదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు.

తెలంగాణపై ప్రభావం లేదు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి):  తెలంగాణ రాష్ట్రంపై ‘తౌక్టే’ తుపాను ప్రభావం ఏమాత్రం లేదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. రాష్ట్రానికి బలమైన కిందిస్థాయి దక్షిణ గాలుల వలన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా సోమవారం కిందిస్థాయి గాలులు తెలంగాణలో దక్షిణదిశ నుండి బలంగా  వీచినట్లు చెప్పారు. రాగల  రెండురోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో  కూడిన తేలికపాటి వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాల్లో పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-18T08:45:09+05:30 IST