శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-07-24T16:52:00+05:30 IST

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‎కు వరద పోటెత్తుతుంది. అప్రమత్తమైన అధికారులు 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‎ఫ్లో 1,75,000 క్యూసెక్కులు కాగా.. ఔట్‎ఫ్లో 1,70,000 క్యూసెక్కులుగా ఉంది

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‎కు వరద పోటెత్తుతుంది. అప్రమత్తమైన అధికారులు 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‎ఫ్లో 1,75,000 క్యూసెక్కులు కాగా.. ఔట్‎ఫ్లో 1,70,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,089 అడుగులు ఉంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 80.139 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-07-24T16:52:00+05:30 IST