నెల రోజుల పసికందును రూ.50 వేలకు అమ్మిన తల్లి

ABN , First Publish Date - 2021-07-08T16:50:46+05:30 IST

జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసీ, పురిటి నొప్పులు భరించి కన్నతల్లి. బిడ్డను అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లి...బిడ్డను రూ.50వేలకు అమ్మేసింది

నెల రోజుల పసికందును రూ.50 వేలకు అమ్మిన తల్లి

నిజామాబాద్: జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసీ, పురిటి నొప్పులు భరించి బిడ్డకు జన్మనిచ్చిన కన్నతల్లి నెలరోజులకే తన బిడ్డను అమ్మేసింది. బిడ్డను అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లి..రూ.50వేలకు అమ్మింది. ఈ ఘటన ఆలస్యంగా ఇందూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తన బిడ్డకు నెల రోజుల క్రితం ఆ తల్లి జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలిద్దరికి రక్తహీనత ఉండటంతో తల్లిబిడ్డలను మరో ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో ఓ మహిళ సాయంతో ఆ తల్లి రూ.50వేలకు బిడ్డను అమ్మడానికి బేరం కుదుర్చుకుని అమ్మేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకుని శిశువును ఐసిడిఎస్‎కు తరలించారు.

Updated Date - 2021-07-08T16:50:46+05:30 IST