నిజామాబాద్‌ బతుకమ్మ సంబురాల్లో కవిత

ABN , First Publish Date - 2021-10-14T08:20:13+05:30 IST

దుబాయిలో ఈ నెల 23న బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి ..

నిజామాబాద్‌ బతుకమ్మ సంబురాల్లో కవిత

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 13: దుబాయిలో ఈ నెల 23న బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ హాజరవుతారని చెప్పారు. బుధవారం నిజామాబాద్‌ నగరం హౌసింగ్‌ బోర్డు కాలనీలో తన నివాసం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, మహిళలతో కలిసి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. అనంతరం బతుకమ్మ ఆడారు. 

Updated Date - 2021-10-14T08:20:13+05:30 IST