పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-06-21T05:45:58+05:30 IST

పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలి

పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలి
పరకాల పట్టణంలో రాస్తారోకో నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

పరకాల, జూన్‌ 20 : పోరాటాల గడ్డ పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత ఏటీఎం సెంటర్‌ సమీపంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. పరకాలను వెంటనే అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలని, భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. బస్తాండ్‌ కూడలి నుంచి ర్యాలీ నిర్వహించి, ధర్మారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ, ప్లకార్డులతో నిరసన తెలిపారు. పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి మాట్లాడుతూ నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర పరకాల ప్రజలకు ఉందని, మరో జలియన్‌వాల్‌బాగ్‌ చరిత్ర పుటల కెక్కిచిన పరకాల ప్రాంతని పాలకుల నిర్లక్ష్యం, సొంత లాభాల కోసం జిల్లాల పునర్విభజనలో పరకాలకు పూర్తిగా అన్యాయం చేశారని ఆరోపించారు. 

ఫఆందోళనకారుల అరెస్టు 

బీజేపీ నాయకులు కాచం గురుప్రసాద్‌, దేవునూరి మేఘనాఽథ్‌, ఆర్‌పీ. జయంత్‌లాల్‌, బాసాని సోమరాజు, కొలనుపాక భద్రయ్య, బెజ్జంకి పూర్ణచారి, గాజుల నిరంజన్‌, మంతెన సంతోష్‌, పురుషోత్తం, తిరుపతి, గణేష్‌, రంజిత్‌, వీరాస్వామి, నారాయణదాస్‌, సారంగపాణిలను పరకాల ఏసీపీ శ్రీనివాస్‌, సీఐ మహేందర్‌లు సంఘటన స్థలానికి చెరుకొని ఆరెస్టు చేసి పోలీస్‌ స్టెషన్‌కు తరలించారు. 13 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-06-21T05:45:58+05:30 IST