సాగు చట్టాలపై నిరసన జ్వాలలు
ABN , First Publish Date - 2021-02-07T04:42:48+05:30 IST
సాగు చట్టాలపై నిరసన జ్వాలలు

నర్సంపేట, ఫిబ్రవరి 6 : ఢిల్లీలో రైతు ఉద్యమానికి మద్దతుగా అఖిల భారత కిసాన్ సంఘర్షణ కో ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు నర్సంపేటలో వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించగా, పోలీసులు అడ్డుకున్నారు. ద్వారకపేట రోడ్ నుంచి అమరవీరుల స్థూపం వరకు వామపక్ష నాయకులు తరలివచ్చి అమరవీరుల స్థూపం వద్ద రాస్తారోకో చేపట్టారు. ఎస్సై నవీన్‌కుమార్ ఆందోళనకారులు సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేశ్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు భూక్యసమ్మయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, సీఐటీయూ జిల్లా కన్వీనర్ రవి, ఎంసీపీఐయూ జిల్లా కమిటీ సభ్యుడు వెంకన్న, రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి పైడి తదితరులను బలవంతంగా వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
- రైతు ఉద్యమాలపై నిర్బంధాలు విధించడం కేసీఆర్ ప్రభుత్వానికి తగదని ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయకార్యదర్శి పెద్దారపు రమేశ్, రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్ల పైడి, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమారస్వామి, దళితరత్న కల్లెపెల్లి ప్రణయదీప్ అన్నారు. పట్టణంలోని ఎంసీపీఐ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.
- రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని మహబూబాబాద్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమాశాన్ని నిర్వహించారు. అసెంబ్లీలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని తీర్మానించి, రైతులపై చిత్తశుద్ధిని ప్రభుత్వం చాటుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండి,.ఇమామ్, బీసీసెల్ రా ష్ట్ర ఉపాద్యక్షుడు నర్సింగరావు, టీడీపీ పార్లమెంట్ ఉపాద్యక్షుడు వేములబొందయ్యగౌడ్, ప్రేమ్‌చంద్, తూనం స్వామి, రాజిరెడ్డి, పర్వతాలు, రాజేందర్, బాసా పాల్గొన్నారు.
వర్ధన్నపేట : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే ప్రభుత్వ పతనం తప్పదని సీపీఐ ఎంఎల్ వరంగల్ డివిజన్ కార్యదర్శి చిర్ర సూరి, సీపీఎం జిల్లా నాయకులు ఆరెల్లి రవి, ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి వల్లందాసు కుమార్, సీపీఎం నాయకులు పుట్ట సోములు హెచ్చరించారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వర్ధన్నపేటలో ప్రధాన రహదారిని దగ్బంధం చేయగా, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
రాయపర్తి: ఏఐసీసీ పిలుపు మేరకు జాతీయ రహదారిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు జాటోతు హమ్యానాయక్, కృష్ణరెడ్డి, రత్నాకర్‌రెడ్డి, శ్రీనివాస్, కమల్‌సింగ్, చిన్నపాక ఎల్లయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, కేంద్రం సాగు చట్టాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎంసీపీఐ(యూ) నాయకులు గుగులోతు నానునాయక్, కాగితం వెంకన్న, నర్సింహులు తదితరులను ముందస్తు అరెస్టు చేశారు.