సుప్రీం స్టే రైతు సంఘాల పాక్షిక విజయం: నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-01-13T09:08:05+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీకోర్టు స్టే ఇవ్వడం రైతు సంఘాల పాక్షిక విజయమని మంత్రి సింగిరెడ్డి అన్నారు. 45 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు

సుప్రీం స్టే రైతు సంఘాల పాక్షిక విజయం: నిరంజన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం/హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీకోర్టు స్టే ఇవ్వడం రైతు సంఘాల పాక్షిక విజయమని మంత్రి సింగిరెడ్డి అన్నారు. 45 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నందున సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందని చెప్పారు.  కేంద్ర చట్టాలపై పునఃసమీక్ష చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ముకునూరు, ఉప్పరిగూడలో మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పరిగూడలో జరిగిన రైతుసభలో ఆయన మాట్లాడారు. కేంద్రం తెచ్చిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేయడం తప్పదని, ఏడాదిపాటు వేచి చూద్దామని, ఆయా చట్టాలతో రైతులకు మేలు జరిగితే తాము కూడా వీటిని స్వాగతిస్తామని పేర్కొన్నారు. కాగా తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారు (ఏఈవో)ల సంఘం డైరీ- 2021ను మంత్రి నిరంజన్‌ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, టీఏఈవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, కార్యదర్శి సురేష్‌ రెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-13T09:08:05+05:30 IST