హుజూరాబాద్‌లో తొమ్మిది నామినేషన్లు

ABN , First Publish Date - 2021-10-08T02:04:37+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు గురువారం తొమ్మిది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌

హుజూరాబాద్‌లో తొమ్మిది నామినేషన్లు

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు గురువారం తొమ్మిది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. నూర్జహాన్‌ బేగం, గడ్డం రమేష్‌, పిడిశెట్టి రాజు,  వురుమల్ల విశ్వం,  కుమ్మరి ప్రవీణ్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరుపున అతని సోదరుడు ఈటల భద్రయ్య నామినేషన్‌ వేశారు. ఈటల జమున తరుపున బీజేపీ నాయకుడు కంకణాల సురేందర్‌రెడ్డి రెండవ సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థిగా సిలివేరు శ్రీకాంత్‌,  కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగ్‌రావు తరుపున ఆ పార్టీ నాయకుడు కొల్లూరి కిరణ్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

Updated Date - 2021-10-08T02:04:37+05:30 IST