తెలంగాణ నుంచి గణనీయంగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు

ABN , First Publish Date - 2021-12-15T07:48:34+05:30 IST

తెలంగాణ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ నుంచి గణనీయంగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు

లోక్‌సభలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మంత్రి సమాధానం ప్రకారం... 2019-20లో తెలంగాణ నుంచి రూ. 2692.15 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అవ్వగా, 2020-21లో అవి రూ. 4180.14 కోట్లకు పెరిగాయి. అందులో పత్తి ఎగుమతులు భారీ స్థాయిలో పెరగడం గమనార్హం. 2019-20లో రూ. 465.43 కోట్ల విలువైన పత్తి ఎగుమతి అవ్వగా... 2020-21లో రూ. 1056.09 కోట్ల విలువైన పత్తి ఎగుమతి అయింది. అలాగే బియ్యం, సుగంధ ద్రవ్యాలు, కాఫీ ఎగుమతులూ పెరిగాయి.2019-20లో రూ.633.4కోట్ల విలువైన బియ్యం ఎగుమతులు జరగగా, 2020-21లో రూ.911.92కోట్ల విలువైన బియ్యం ఎగుమతి అయ్యాయి. అయితే, పండ్లు, కూరగాయలతో సహా పలు ఉత్పత్తుల ఎగుమతులు తగ్గాయి. 

Updated Date - 2021-12-15T07:48:34+05:30 IST