బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు వద్దు : సీఐ
ABN , First Publish Date - 2021-12-31T19:33:57+05:30 IST
నూతన సంవత్సర వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలని దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్ అన్నారు.

చెన్నారావుపేట, డిసెంబరు 30: నూతన సంవత్సర వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలని దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలల్లో వేడుకలను జరుపుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు. రహదారులపై ముమ్మరంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను చేపడతామని తెలిపారు.