బీజేపీ, టీఆర్ఎస్‌లవి దిగజారుడు రాజకీయాలు: నాయిని రాజేందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-02-01T19:16:39+05:30 IST

వరంగల్: బీజేపీ, టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్‌లవి దిగజారుడు రాజకీయాలు: నాయిని రాజేందర్‌రెడ్డి

వరంగల్: బీజేపీ, టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం మూడు ఒకతాను ముక్కలేనన్నారు. 18ఏళ్లు నిండిన యువతకు విషం నూరి పోస్తున్నారన్నారు. వరంగల్ ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలను దృష్టి మరల్చేందుకే రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారు. మతతత్వ రాజకీయాలతో లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. ఐకమత్యానికి మారుపేరైన ఓరుగల్లులో ఓట్ల కోసం ప్రజల మధ్య కల్లోలాలు సృష్టిస్తున్నారన్నారు. రాత్రి సిట్టింగ్స్‌లో ప్లానింగ్.. పగలు ఇంప్లిమెంట్ చేస్తున్నారని నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు.

Updated Date - 2021-02-01T19:16:39+05:30 IST