కొండాపూర్‌ ఆస్పత్రికి జాతీయ స్థాయి ‘ఎన్‌క్వాస్‌’ గుర్తింపు

ABN , First Publish Date - 2021-05-30T08:55:05+05:30 IST

రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ ఆస్పత్రికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌క్వా్‌స) గుర్తింపు లభించింది.

కొండాపూర్‌ ఆస్పత్రికి జాతీయ స్థాయి ‘ఎన్‌క్వాస్‌’ గుర్తింపు

రెండో స్థానంలో జనగామ, మూడో స్థానంలో సిరిసిల్ల ఆస్పత్రులు 

జనగామ, మే 29 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ ఆస్పత్రికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌క్వా్‌స) గుర్తింపు లభించింది. ఆస్పత్రుల పనితీరు, పనిలో నాణ్యత, వైద్యసేవలు, ఆస్పత్రి అభివృద్ధి వంటి అంశాల ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌క్వాస్‌ మూడు ఆస్పత్రులను ఎంపిక చేయగా కొండాపూర్‌ ఆస్పత్రి 91.40 వెయిటేజీ స్కోర్‌తో మొదటి స్థానంలో నిలవగా, జనగామ జిల్లా ఆస్పత్రి 87.49 వెయిటేజీతో రెండో స్థానంలో నిలిచింది. 85.25 వెయిటేజీతో జగిత్యాల జిల్లా ఆస్పత్రి మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచిన కొండాపూర్‌ ఆస్పత్రికి ‘‘క్వాలిటీ సర్టిఫైడ్‌’’ సర్టిఫికెట్‌, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జనగామ, జగిత్యాల జిల్లా ఆస్పత్రులకు ‘‘క్వాలిటీ సర్టిఫికెట్‌’’ను మంజూరు చేశారు.  

Updated Date - 2021-05-30T08:55:05+05:30 IST