నర్సాపూర్ మునిసిపల్ కమిషనర్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-10-29T08:14:34+05:30 IST
ధి కుక్కలను సామూహికంగా చంపించారన్న ఆరోపణల నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మునిసిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సస్పెన్షన్‌కు గురయ్యారు.
కుక్కలను సామూహికంగా చంపించారని ఆరోపణ
నర్సాపూర్: వీధి కుక్కలను సామూహికంగా చంపించారన్న ఆరోపణల నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మునిసిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిలా ్లఅదనపు కలెక్టర్ ప్రణీత సింగ్‌ను ఆదేశించినట్లు సమాచారం. నర్సాపూర్ మునిసిపల్ పరిధిలో పెద్ద సంఖ్యలో వీధి కుక్కులను చంపించి పాతిపెట్టారని హైదరాబాద్‌కు చెందిన జంతు ప్రేమికులు బుధవారం నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుక్కల కళేబరాలను వెలికితీయించి పోస్టుమార్టం చేయించారు. .