విద్యార్థి ఉద్యమాలతో బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2021-10-22T05:11:48+05:30 IST

విద్యార్థి ఉద్యమాలతో బుద్ధి చెప్పాలి

విద్యార్థి ఉద్యమాలతో బుద్ధి చెప్పాలి
పీపుల్‌స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి

 ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను,

పీపుల్‌స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి

జనగామ కల్చరల్‌, అక్టోబరు 21: విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను, పీపుల్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎల్‌.మూర్తి అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడారు. దేశంలో రైతు సమస్యలు, విద్యారంగ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. రైతు సంక్షేమం కోసం విద్యార్థులు సమరశీల పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇటీవల ఎనిమిది మంది రైతులను పొట్టన పెట్టుకున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సినీ హీరో నారాయణమూర్తి ఏం పిల్లడో.. అంటూ పాట పాడి సభికులను ఉత్సా హపరిచారు. కార్యక్రమ ంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర నాయకులు తాటికొండ రవి, జావిద్‌, మిష్రిన్‌ సుల్తానియా, అరవింద్‌, రజనీకాంత్‌, ధర్మభిక్షం, నరేందర్‌, శిరీష తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:11:48+05:30 IST