మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడిగా నరసింహ

ABN , First Publish Date - 2021-11-23T08:37:34+05:30 IST

తెలంగాణ రాష్ట్ర మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడిగా గోరెంకల నరసింహ, ప్రధాన కార్యదర్శిగా లెల్లెల బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడిగా నరసింహ

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడిగా గోరెంకల నరసింహ, ప్రధాన కార్యదర్శిగా లెల్లెల బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర మూడో మహాసభల్లో సోమవారం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మురారి మోహన్‌, ముఠా విజయ్‌ కుమార్‌, చనమోని శంకర్‌, పగడాల నాగేశ్వరరావు, కార్యదర్శులుగా కొప్పు పద్మ, కర్రెల్లి లలిత, అర్వపల్లి శ్రీరాములు, మునిగెల రమేష్‌, బోడెంకి చందు, తేలు ఇస్తారిలు ఎన్నికయ్యారు.

Updated Date - 2021-11-23T08:37:34+05:30 IST