బాలికపై లైంగిక దాడి కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
ABN , First Publish Date - 2021-08-04T01:17:54+05:30 IST
బాలికపై లైంగిక దాడి కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నాంపల్లి హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఓ హోంగార్డ్‌కు 30 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకారంగేట్‌లో మైనర్ బాలికపై హోం గార్డ్ మల్లికార్జున్ లైంగిక దాడి చేశారు. ఫిబ్రవరి 19న హోంగార్డ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక గర్భం దాల్చడంతో మెడికల్ రిపోర్ట్ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ వరకు పోలీసులు అన్ని ఆధారాలు సేకరించి కోర్ట్‌లో సమర్పించారు. కేసు విచారణ కోర్టు నిందితుడికి 30 సంవత్సరాలు జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 40 వేలు బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది.