నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ అప్‌డేట్స్

ABN , First Publish Date - 2021-05-02T18:20:38+05:30 IST

తెలంగాణలో ప్రధాన రాజకీయపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి పరిధిలోని పౌరసరఫరాల గోదాంలో కొద్ది నిమిషాల క్రితమే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ అప్‌డేట్స్

నల్గొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ 18,449 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై నోముల భగత్ విజయం సాధించారు. వరుసగా తొలి తొమ్మిది రౌండ్లలో నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించారు. 10,11,14 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యం కనబరిచారు. మిగితా రౌండ్లలో మాత్రం టీఆర్‌ఎస్ ముందుంది. ఇక కాంగ్రెస్‌కు 59, 239 ఓట్లు, బీజేపీకి 6,365 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో నిలువగా, బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాకుండా పోయింది.



తెలంగాణలో ప్రధాన రాజకీయపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి పరిధిలోని పౌరసరఫరాల గోదాంలో జరిగింది. సాగర్‌ నియోజకవర్గంలో మొత్తం 2,20,206 మంది ఓటర్లు ఉండగా1,89,782మంది (86.18 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 41మంది అభ్యర్థులు పోటీపడగా, 346 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించారు. కాగా.. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ తరఫున రవికుమార్ పోటీ చేశారు. 


7వ రౌండ్‌ :-  (10:50AM)

టీఆర్ఎస్‌ - 4,022

కాంగ్రెస్‌ - 2,607


ఆరో రౌండ్‎లో టీఆర్ఎస్ ఆధిక్యం (10:32 AM)

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భ‌గ‌త్‌ ముందంజలో ఉన్నారు. ఆరో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌ 5,177 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆరవ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 3989 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి 3,049 ఓట్లు, బీజేపీ అభ్యర్థి  రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి.


ఐదవ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ ఆధిక్యం (10:20 AM)

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఐదవ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ 4,334 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఐదవ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 3,442 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి 2,676ఓట్లు, బీజేపీ అభ్యర్థి  రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి.


మూడో రౌండ్‌లో 2665 ఓట్ల ఆధిక్యం (9:15 AM)

సాగర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మూడో రౌండ్‌లోనూ టీఆరెస్సే లీడ్‌లో ఉంది. 3వ రౌండ్ ముగిసే సరికి టీఆరెస్ అభ్యర్థి నోముల భగత్ 2665 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా.. మూడో రౌండ్‌లో టీఆరెస్‌కు 3421, కాంగ్రెస్‌కు 2882 ఓట్లు వచ్చాయి.


రెండో రౌండ్‌లో భగత్ లీడ్‌ (9:01 AM)

సాగర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు రెండో రౌండ్‌లో టీఆరెస్ లీడ్‌లో ఉంది. రెండో రౌండ్ ముగిసేసరికి టీఆరెస్ అభ్యర్థి నోముల భగత్ 2216 లీడ్‌లో ఉన్నారు.


లీడ్‌లో టీఆర్ఎస్.. (8:34 AM)

నాగార్జున సాగర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆరెస్ లీడ్‌లో ఉంది. తొలి రౌండ్‌లో 1475 ఓట్లతో టీఆరెస్ లీడ్‌లో ఉంది. టీఆరెస్‌కు మొత్తం 4228 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 2753 ఓట్లు వచ్చాయి.


9:30 గంటలకు తొలి ఫలితం (8:13 AM)

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆర్జాలబావిలోని గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సాగర్‌లో మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీ చేసిన విషయం విదితమే. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఆ తర్వాత 1388 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తొలుత గుర్రంపోడు మండలం ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వరుసగా పెద్దవూర, తిరుమలగిరి, సాగర్‌ మండలాల వారిగా ఓట్ల లెక్కింపు జరుగుతంది. వరుసగా అనుముల, నిడమనూరు, మాడుగులపల్లి మండలాలు.. చివరగా త్రిపురారం మండలం ఓట్ల లెక్కింపు జరగనుంది. రెండు హాళ్లలో మొత్తం 14 టేబుల్స్‌‌ను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి టేబుల్‌కు ఐదుగురు చొప్పున సిబ్బంది ఉన్నారు. తొలి రౌండ్ ఫలితం ఉదయం 08:20 వస్తుందని అందరూ భావించినప్పటికీ 9:30 గంటకు ఫలితం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తుది ఫలితం వచ్చేసరికి సాయంత్రం అవుతుందని సమాచారం.


తెలంగాణ భవన్ సంబరాల్లో మంత్రులు.. (12:27 PM)

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో తెలంగాణ భవన్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణా సంచాలు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఈలలు, కేకలతో హోరెత్తిస్తున్నారు. ఈ సంబరాల్లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సంబరాల్లో బాణా సంచాల థాటికి భవన్‌లోని పార్టీకో పందిరికి మంటలు అంటుకున్నాయి. అయితే ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో తెలంగాణ భవన్ సిబ్బంది, మంత్రులు ఊపిరిపీల్చుకున్నారు. 


తెలంగాణ భవన్ సంబరాలు.. అపశృతి (12:22 PM)

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో అటు సాగర్‌తో పాటు ఇటు హైదరాబాద్‌లోనూ కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు షురూ చేశాయి. తెలంగాణ భవన్‌లోనూ పార్టీ నేతలు, పలువురు ముఖ్య కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే బాణసంచాల మంటల థాటికి ఒక్కసారిగా పార్టీకో పందిరి అంటుకుంది. దీంతో మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ఏమీ జరగలేదు.


12వ రౌండ్ :- (12:12 PM)

టీఆరెస్- 3833

కాంగ్రెస్- 2578

12వ రౌండ్‌లో టీఆరెస్ లీడ్ -1255

టీఆరెస్‌ అభ్యర్థి మొత్తం లీడింగ్ - 10,361 ఓట్లు.


11వ రౌండ్‌లో మళ్లీ ఆధిక్యతలో టీఆర్ఎస్ (11:43 AM)

మొదటి 9 రౌండ్లలో ఆధిక్యతలో కొనసాగిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్.. పదవ రౌండ్‌లో వెనుకబడ్డారు. అయితే 11వ రౌండ్‌లో మళ్లీ పుంజుకున్నారు. 11వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 9106 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


11వ రౌండ్ :- 

టీఆరెస్- 3395

కాంగ్రెస్- 2225

11వ రౌండ్‌లో టీఆరెస్ లీడ్ - 1170 ఓట్లు.


పదో రౌండ్‌లో కాంగ్రెస్ ముందంజ (11:34 AM)

నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో 9 రౌండ్ల వరకూ ఆధిక్యంలో కొనసాగిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ స్పీడ్‌కు కాంగ్రెస్ పార్టీ బ్రేక్ వేసింది. ఏ ఒక్క రౌండ్‌లోనూ లీడ్‌లోకి రాని కాంగ్రెస్.. పదో రౌండ్ వచ్చేసరికి ఆధిక్యంలో కొనసాగుతోంది. 10వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి 175 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగతున్నారు. అయితే ఇదే ఊపు నెక్స్ట్ రౌండ్‌లో కూడా కొనసాగుతుందో లేకుంటే మొదటి 9 రౌండ్ల మాదిరిగానే మళ్లీ అదే పరిస్థితి వస్తుందో వేచి చూడాలి.


9వ రౌండ్ ముగిసే సరికి టీఆరెస్ 8111 ఓట్ల ఆధిక్యం (11:00 AM)

9వ రౌండ్ :- 

టీఆరెస్- 2205

కాంగ్రెస్- 2042

9వ రౌండ్‌లో టీఆరెస్ లీడ్ -163


8వ రౌండ్‌ :- (10:56 AM)

టీఆర్ఎస్‌- 3,249

కాంగ్రెస్‌ 1,893

లీడింగ్ 1356.

టీఆర్ఎస్‌ మొత్తం లీడింగ్ ఓట్లు - 7,948


ఫైనల్ రౌండ్: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల లెక్కింపు పూర్తి...

18,872 ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఘన విజయం.

టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌కు వచ్చిన ఓట్లు...89,804.

కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి .....70,932

బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్.....7,676

చపాతీ రోలర్ నందిపాటి జానయ్య.....2,915

టీడీపీ అభ్యర్థి అరుణ్ కుమార్.....1,714


24వ రౌండ్‌లోనూ ఆధిక్యంలో దూసుకెళ్తున్న టీఆర్ఎస్ (2:40PM)

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు జరిగిన 24 రౌండ్ల కౌంటింగ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో కొనసాగుతున్నారు. 

* 19వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్ 14,476 ఓట్ల ఆధిక్యం

టీఆర్‌ఎస్ 3732, కాంగ్రెస్ 2652 

* 20వ రౌండ్ ముగిసేసరికి టీఆరెస్ 15,070 ఓట్ల ఆధిక్యం 

టీఆర్ఎస్ 3740, కాంగ్రెస్ 3146. టీఆర్ఎస్ లీడ్ 594

* 21వ రౌండ్ ముగిసేసరికి టీఆరెస్ 15,522 ఓట్ల ఆధిక్యం

టీఆర్ఎస్ 3463, కాంగ్రెస్ 3011, టీఆర్ఎస్ లీడ్ 452

* 22వ రౌండ్ ముగిసేసరికి టీఆరెస్ 16,765 ఓట్ల ఆధిక్యం

టీఆర్ఎస్ 3783, కాంగ్రెస్ 2540, టీఆర్ఎస్  లీడ్ 1243

* 24వ రౌండ్ ముగిసే సరికి టీఆరెస్ 18,414 ఓట్ల ఆధిక్యం

టీఆర్ఎస్ 3312, కాంగ్రెస్ 2512, టీఆర్ఎస్ లీడ్ 800.


ఓటమి దిశగా జానారెడ్డి.. డిపాజిట్ దక్కని బీజేపీ.. (1:25 PM)

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఓటమి అంచుల్లో ఉన్నారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి డాక్టర్ రవినాయక్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు జరిగిన 18 రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 18వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 13,396 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తోంది. 18వ రౌండ్‎లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‎కు 4,074 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,259 ఓట్లు రాగా, 18వ రౌండ్‎లో టీఆర్ఎస్ 1,851  ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.


18వ రౌండ్ :- (1:13 PM)

టీఆరెస్- 4074

కాంగ్రెస్- 2259

18వ రౌండ్ లో టీఆరెస్ లీడ్-1851

18వ రౌండ్ ముగిసేసరికి టీఆరెస్ 13,396 ఓట్ల ఆధిక్యం


17వ రౌండ్ :- (1:10 PM)

టీఆర్ఎస్‌ -3,772

కాంగ్రెస్‌ - 2,349

17వ రౌండ్‌ ముగిసేసరికి టీఆర్ఎస్ 11,581 ఓట్ల ఆధిక్యం


10,066 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి.. (12:52 PM)

16వ రౌండ్:-

టీఆరెస్- 3475

కాంగ్రెస్-3231

16వ రౌండ్‌లో టీఆరెస్ లీడ్- 244 ఓట్లు

16వ రౌండ్‌ ముగిసేసరికి టీఆర్ఎస్ 10,158 ఓట్ల ఆధిక్యం


15వ రౌండ్‌ :- 

టీఆర్ఎస్‌ - 3,203

కాంగ్రెస్‌ - 2,787

15వ రౌండ్‌ ముగిసేసరికి టీఆర్ఎస్ 9,914 ఓట్ల ఆధిక్యం


14వ రౌండ్ల తర్వాత పరిస్థితి ఇదీ..(12:54 PM)

సాగర్ 14వ రౌండ్‌లో కాంగ్రెస్ 1,083 ఓట్ల ఆధిక్యం

14 రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ 9,498 ఓట్ల ఆధిక్యం

Updated Date - 2021-05-02T18:20:38+05:30 IST