గండ్ర దంపతులు కోలుకోవాలని ముస్లింల ప్రార్థనలు

ABN , First Publish Date - 2021-02-27T05:28:28+05:30 IST

గండ్ర దంపతులు కోలుకోవాలని ముస్లింల ప్రార్థనలు

గండ్ర దంపతులు కోలుకోవాలని ముస్లింల ప్రార్థనలు
చిట్యాల మసీదులో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

చిట్యాల, ఫిబ్రవరి 26: కరోనా బారిన పడిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ రూరల్‌ జడ్పీచైర్మన్‌ గండ్ర జ్యోతి దంపతులు త్వరగా కోలుకోవాలని మం డల కేంద్రంలోని ‘మస్జిదే కౌసర్‌’ (మసీదు)లో ముస్లింలు శుక్రవారం ప్రత్యేక ప్రార్థ నలు చేశారు. కోఆప్షన్‌ సభ్యుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌మహ్మద్‌ మాట్లాడుతూ గండ్ర దంపతులు కరోనా మహమ్మారిని త్వరలో జయించాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో మసీదు నిర్వాహక కమిటీ అధ్యక్షుడు అజ్మత్‌ మియా, ఖాజా పాషా, రజాక్‌, అంకూష్‌, సాజిద్‌, అక్బర్‌, షంషొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:28:28+05:30 IST