Hyderabad: చాదర్‌ఘాట్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య
ABN , First Publish Date - 2021-07-17T12:41:59+05:30 IST
నగరంలో దారుణ హత్య జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి చాదర్‌ఘాట్‌లో గుర్తు తెలియని దుండగులు రౌడీషీటర్ ముస్తాక్‌ను కత్తులతో అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న
హైదరాబాద్: నగరంలో దారుణ హత్య జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి చాదర్‌ఘాట్‌లో గుర్తు తెలియని దుండగులు రౌడీషీటర్ ముస్తాక్‌ను కత్తులతో అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణం పాతకక్షలేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.