వసూళ్లు ఇంతేనా..?!

ABN , First Publish Date - 2021-04-12T05:56:02+05:30 IST

భూపాలపల్లి మునిసి పాలిటీలో ఆస్తి పన్ను ల వసూలు అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. ఇంటి యజమా నుల వద్ద నుంచి ట్యాక్సులు రాబట్టడంలో అధికారులకు ఉన్న శ్రద్ధ ప్రభు త్వ రంగ సంస్థల కార్యాలయాల విషయంలో ఉండటం లేదనే విమర్శలు వస్తు న్నాయి.

వసూళ్లు ఇంతేనా..?!

 లక్ష్యం నెరవేరని పన్నుల వసూలు

 భారీగా పేరుకుపోయిన బకాయిలు

రాబట్టింది అంతంత మాత్రమే..

మునిసిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యం

ప్రైవేటు ఆస్తులపైనే ‘ప్రతాపం’.. 

ప్రభుత్వ కార్యాలయాలపై ప్రేమ!

నోటీసులతోనే సరి..

భూపాలపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 11 : భూపాలపల్లి మునిసి పాలిటీలో ఆస్తి పన్ను ల వసూలు అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. ఇంటి యజమా నుల వద్ద నుంచి ట్యాక్సులు రాబట్టడంలో  అధికారులకు ఉన్న శ్రద్ధ ప్రభు త్వ రంగ సంస్థల కార్యాలయాల విషయంలో ఉండటం లేదనే విమర్శలు వస్తు న్నాయి. కోట్లాది రూపా యల బకాయి లు పేరు కుపో యినా వాటిని సమర్థంగా వ సూలు చేయాలనే ఆసక్తి కానరావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. పన్నుల వసూలుకు ప్రతి ఏడాది లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ఆ తర్వాత అది నీరుగారిపోవడం పరిపాటిగా మారిందని తెలుస్తోంది. 

 భూపాలపల్లి పట్టణం విస్తరించే కొద్దీ ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. తద్వారా మునిసిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరు అయిన ఆస్తి పన్నుల విధింపు కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. పట్టణంలో ప్రైవేటు, ప్రభుత్వ, సింగరేణి నిర్మాణాలు మొత్తంగా 12,768 ఉన్నాయి. 2020-2021 ఆర్ధిక సంవత్సరం ఆస్తిపన్నులు రూ.21.03 కోట్లు పేరుకుపోయాయి. మార్చి 31 వరకు మునిసిపల్‌ సిబ్బంది ఇందులో రూ.3.98 కోట్లు  వసూలు చేశారు. ఇంకా రూ.17.05 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. వసూలైన బకాయిల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినవే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. సింగరేణి, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలు అంతగా వసూలు కాలేదని లెక్కలు చెబుతున్నాయి. దీనిపై పలువురు కౌన్సిలర్లు మండిపడుతున్నారు. ప్రైవేటు ఆస్తుల విషయంలో తీసుకొనే చర్యలు ప్రభుత్వ కార్యాలయాలపై ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తు న్నారు. ప్రభుత్వ కార్యాలయాల పన్నుల వసూలుపై మునిసిపల్‌ అధికా రులకు చిత్తశుద్ధి లేకపోవడం విస్మయానికి గురిచేస్తోందని అంటున్నారు.

బకాయిలు ఇలా...

భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలో ప్రైవేటు ఇళ్ల నిర్మాణాలు 11,529 ఉండగా వీరు రూ. 4.25 కోట్లు చెల్లించాల్సి ఉంది.  ఇప్పటి వరకు రూ. 3.44 కోట్లు వసూలు అయ్యాయి. ఇంకా 81 లక్షలు రాబట్టాల్సింది ఉంది. అంటే.. 80 శాతం వసూళ్లు పూర్తయినట్టేనని  అధికారులు చెబుతున్నారు. అలాగే సింగరేణి క్వార్టర్లకు, కార్యాలయాలకు, ప్రభుత్వ కార్యాల యాలకు కలుపుకొని మొత్తంగా రూ.16.78 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిలో  సింగరేణి నుంచి మాత్రమే రూ.55 లక్షలు వసూలు చేశారు. ఇంకా రూ.16.23 కోట్లు రాబట్టాల్సి ఉంది. అంటే... కేవలం 3.28 శాతం మాత్రమే వసూలు చేశారు.   భూపాల పల్లి పట్టణంలోని ఐటీడీఏ భవనానికి సంబంధించిన బకాయి రూ.18.50 లక్షలు, అటవీ శాఖ కార్యాలయాలకు రూ.15.56 లక్షలు, ఎంపీడీవో కార్యాల యం  రూ.10.88 లక్షలు, ఆర్డీవో కార్యాలయం రూ.6.53 లక్షలు, ఆర్టీసీ భవ నాల నుంచి రూ.7.94 లక్షలు, తహసీల్దార్‌ భవనం నుంచి రూ.4.69 లక్షలు బకాయిలు రావాల్సి ఉందని మునిసిపల్‌ అధికారులు తెలిపారు. వీటిపై వారికి నోటీసులు పంపగా తమ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపించామని ఆయా కార్యాలయాల అధికారులు కాలయాపన చేస్తున్నారని మునిసిపల్‌ వర్గాలు అంటున్నాయి.

సింగరేణి..  రూ. 16కోట్లు 

భూపాలపల్లి ఏరియాలోని ఒక్క సింగరేణి యాజమాన్యం వివిధ పన్నుల రూపేణా మునిసిపాలిటీకి రూ.16 కోట్లు చెల్లించాల్సి ఉంది.  ఆరు నెలల క్రితం కేవలం రూ.55 లక్షలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుందని తెలుస్తోంది. ఈ విషయమై సింగరేణి అధికారులను అడగ్గా తమపై అధిక పన్నుల భారం వేశారని, దీనిపై  పునఃపరిశీలిం చాలని కోరినట్లు మునిసిపల్‌ అధికారులు అంటున్నారు. దీనిపై ఆరు నెలలుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 


Updated Date - 2021-04-12T05:56:02+05:30 IST