కరోనా కాలంలోనూ పట్టణాభివృద్ధి

ABN , First Publish Date - 2021-07-10T08:09:24+05:30 IST

కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కొనసాగిందని మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితు

కరోనా కాలంలోనూ పట్టణాభివృద్ధి

లాక్‌డౌన్‌ ను వినియోగించుకుని మౌలిక వసతులు..

వేగంగా పట్టణీకరణ’లో ముందున్న తెలంగాణ

పారిశుధ్యం, పచ్చదనమే ప్రధాన ఎజెండా

కోకాపేటలో గ్రీన్‌  టౌన్‌ షిప్‌, కొత్వాల్‌ గూడలో ఎకో పార్కు: కేటీఆర్‌

మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ 2020-21 ప్రగతి నివేదిక, 21-22 ప్రణాళిక విడుదల 


హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కొనసాగిందని మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ విభాగాలు సమన్వయంతో పనిచేసి, ప్రజల మన్ననలు పొందాయన్నారు. హైదరాబాద్‌ వంటి ప్రదేశాల్లో లాక్‌డౌన్‌  పరిస్థితులను వినియోగించుకుని పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించామన్నారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ 2020-21 వార్షిక ప్రగతి నివేదికను, 2021-22లో  చేపట్టనున్న పురోగతి ప్రణాళికను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందున్నదని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. ఈ ఆర్థిక సంవత్సర ప్రణాళికల్లో పచ్చదనం, పారిశుధ్యానికే మునిసిపల్‌ శాఖ ప్రాధాన్యమివ్వనుంది. ఈ అంశాలే ప్రధాన ఎజెండాలుగా 2021-22 ప్రణాళికలు రూపొందించింది. 


2021-22 సంవత్సరంలో ప్రణాళికలు..

పట్టణ స్థానిక సంస్థల్లో 2067 పట్టణ ప్రకృతి వనాల (ట్రీ పార్కులు, రోడ్డు పొడవునా 400 కిలోమీటర్లు అవెన్యూ తోటలు) నిర్మాణం

వరంగల్‌లో వ్యర్థాలతో బయో మైనింగ్‌ ఏర్పాటు

130 పట్టణ స్థానిక సంస్థల్లో 35.50 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను పూర్తిగా బయో మైనింగ్‌ చేయడం. 47 పట్టణ స్థానిక సంస్థల్లో మానవ వ్యర్థాల నిర్వహణలను పూర్తి చేయడం. వీటికి 68 కొత్త మునిసిపాలిటీల్లో టెండర్లు ఖరారు చేయడం

38 మునిసిపాలిటీల్లో రూ.1433 కోట్లతో నీటి సరఫరా పథకాలు పూర్తి చేయడం

నాలాల అభివృద్ధి కార్యక్రమం కింద ఐఎన్‌ఆర్‌ రూ.858.32 కోట్లతో 15ప్యాకేజీల కింద 49 పనులు

రూ.700 కోట్లతో సమీకృత మాంసాహార, శాఖాహార మార్కెట్లు, వైకుంఠ ధామాలను పూర్తి చేయడం

పాతనగరం అభివృద్ధి, ట్రాఫిక్‌ రద్దీని నివారణకు మూసీపై 15 చోట్ల వంతెనలు, చెక్‌ డ్యాంల నిర్మాణం

ఈవీఆర్‌టీ్‌స(మెట్రో-నియో ప్రాజెక్టు)ను కేపీహెచ్‌ బీ-ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌-కోకాపేట వరకు పీపీపీ పద్ధతిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక లు

హెచ్‌ఎండీఏ, ఓఆర్‌ఆర్‌ల వెంట మీడియన్‌, అవెన్యూలలో ఇప్పుడున్న ట్యాంక్‌ ఆధారిత పద్ధతి స్థానంలో రూ. 47 కోట్ల వ్యయంతో ఆటోమేటెడ్‌ బిందు సేద్యం 

నానక్‌రామ్‌గూడ నుంచి టీఎ్‌సపీఏ, నార్సింగి నుంచి కొల్లూరుకు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఇప్పుడున్న సర్వీసు రోడ్లను వెడల్పు చేయడం. 

మెహిదీపట్నం, ఉప్పల్‌లలో స్కై వాక్‌ నిర్మాణాలను నవంబరు నాటికి పూర్తి చేయడం. రూ.25 కోట్లతో స్కైవాక్‌ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.36.80 కోట్లతో మెహిదీపట్నంలో చేపట్టిన పనులు కూడా కొనసాగుతున్నాయి

హిమాయత్‌ సాగర్‌ వద్ద ఉన్న కొత్వాల్‌గూడలో 85 ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటు. 

నియో పోలీస్‌ కోకాపేట వద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ టౌన్‌ షిప్‌ డిస్ట్రిక్ట్‌ ఏర్పాటు జరుగుతోంది. దీని ద్వారా ఆరేళ్లలో సుమారు లక్ష మందికి ఉపాధి కల్పన


 ప్రగతి నివేదిక ముఖ్యాంశాలు..

పీఎం ఆత్మ నిర్భర్‌ భారత్‌  కింద 3,47,006 మందికి రూ.347 కోట్ల రుణాల మంజూరు

దుర్గం చెరువు వద్ద కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి

జీడిమెట్ల వద్ద 500 టీపీడీని ప్రాసెస్‌ చేసే సామర్థ్యంతో నిర్మాణ వ్యర్థాలప్లాంటు ప్రారంభం.

హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ వద్ద వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంటు ప్రారంభం

ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై ట్రామా రక్షణ కోసం 10 ఇంటర్‌ చేంజ్‌ల ఏర్పాటు

మొదటి లాక్‌డౌన్‌లో 373 కేంద్రాల ద్వారా 2,53,97,580 అన్నపూర్ణ భోజనాలు, వసతి

నగరంలో 31 బస్తీ దవాఖానాల ప్రారంభం

హైదరాబాద్‌లో 165 చోట్ల గ్రీన్‌ ఫీల్డ్‌ లింక్‌ రోడ్ల్లు

హైదరాబాద్‌కు గోదావరి నీరందించే ప్రాజెక్టులో రూ.285 కోట్లతో రింగ్‌ మెయిన్‌  విస్తరణ

పట్టణ ప్రాంతాల్లోని 37290 మహిళా స్వయం సహాయక సంఘాలకు 1759.76 కోట్ల రుణాలు

141 పురపాలికల్లో 4,118 మరుగుదొడ్ల నిర్మాణం. 1,898 శానిటేషన్‌  వాహనాల సమీకరణ

వరంగల్‌, ఖమ్మంలో రోజువారీ నీటి సరపరా

నిజామాబాద్‌, సిద్దిపేటలో భూగర్భ మురుగునీటి వ్యవస్థలు రూ.543 కోట్లతో పూర్తి

హైదరాబాద్‌ మెట్రోలో క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత టికెటింగ్‌తో పాటు మరికొన్ని సదుపాయాలు

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై రూ.38 కోట్లతో సుందరీకరణ పనులు దాదాపు పూర్తి. రూ.26.40 కోట్లతో నెక్లెస్‌ రోడ్‌పై పూర్తికావచ్చిన రాళ్లు పరిచే పనులు

Updated Date - 2021-07-10T08:09:24+05:30 IST