ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సీఎం పాలనకు రెఫరెండం

ABN , First Publish Date - 2021-03-22T05:22:58+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సీఎం పాలనకు రెఫరెండం

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సీఎం పాలనకు రెఫరెండం
సమావేశంలో మాట్లాడుతున్న ముసిపల్‌ చైర్మన్‌ రాంమోహన్‌రెడ్డి

మునిసిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి

మహబూబాబాద్‌ టౌన్‌, మార్చి 21: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్‌ పాలనకు రెఫరెండమని మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, మేధావులు, ఉద్యోగులు ప్రగతికి  పట్టం కట్టారని చెప్పారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజాభ్యున్నతే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్థానం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు మనుగడ లేదని తేలిపోయిందన్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలుచుకున్న బీజేపీ అంతా మాదేనని దుందుడుకుగా వ్యవహరిస్తూ కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. టీఆర్‌ఎస్‌ను ఆదరించి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ ఎమ్డీ.ఫరీద్‌, కేసముద్రం మార్కెట్‌ మాజీ చైర్మన్‌ పర్కాల శ్రీనివాసరెడ్డి, అర్బన్‌ అధ్యక్షుడు గద్దె రవి, కేఎస్‌ఎన్‌.రెడ్డి, కౌన్సిలర్లు మార్నేని రఘు, గుగులోతు బాలునాయక్‌, దాసరి రావిష్‌, బోనగిరి గంగాధర్‌, ఇస్మాయిల్‌, నవీన్‌, బోగా రవిచంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T05:22:58+05:30 IST