ఇసుక రీచ్‌లతో గిరిజనులకు ఉపాధి

ABN , First Publish Date - 2021-12-31T20:01:54+05:30 IST

గోదావరి తీరంలో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం ఇసుక రీచ్‌ ద్వారా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తోందని డీఆర్వో రమాదేవి అన్నారు.

ఇసుక రీచ్‌లతో గిరిజనులకు ఉపాధి

ములుగు డీఆర్వో రమాదేవి

మంగపేట, డిసెంబరు 30: గోదావరి తీరంలో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం ఇసుక రీచ్‌ ద్వారా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తోందని డీఆర్వో రమాదేవి అన్నారు. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి, కాలుష్య నియంత్రణ సంస్థల అధికారులతో కలిసి మండలంలోని అకినేపల్లి మ ల్లారం, ఎస్టీకాలనీలోని పల్లెప్రకృతి వనం వద్ద గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ల నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మొత్తం 1100 మంది జనాభాలో 737 మంది ఓటర్లు ఉండగా ఇసుక రీచ్‌లకు అందరూ ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఇసుక రీచ్‌ల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధిని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు టీఎ్‌సఎండీసీ  ఏడీ రఘుబాబు, పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు ఈఈ ఎం.వెంకటనర్సు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ ప్రాజెక్టు ఆఫీసర్‌ ఎన్‌. ఎల్లయ్య హాజరయ్యారు.  జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్‌ డైరెక్టర్‌ నాశిరెడ్డి సాంబశివరెడ్డి, తహసీల్ధార్‌ జె.బాబ్జీప్రసాద్‌, ఎంపీడీవో కె.శ్రీఽధ్‌, ఎంపీవో బి.శ్రీకాంత్‌, ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్‌ సభ్యుడు రాజమల్ల సుకుమార్‌,  మాజీ సర్పంచ్‌ వత్సవాయి శ్రీధర్‌వర్మ,  ఆర్‌ఐ సునీల్‌, టీఎ్‌సఎండీసీ అధికారి ఎల్లయ్య, గ్రామ ప్రత్యేక అధికారి టి.విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కోడేపాక శ్రవణ్‌కుమార్‌, వీఆర్వో పత్రి బానయ్య తదితరులు పాల్గొన్నారు.


 లక్ష్మీనరసింహస్వామి దర్శనం

మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామిని డీఆర్వో రమాదేవి దర్శించుకున్నారు. ఆమెకు అర్చక, ఉద్యోగులు పూర్ణకుంభంతో స్వాగతం పలికాలు. కొండపైన కొలువైన ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి గర్భాలయంలో ప్రత్యేక  పూజల అనంతరం  శేషావస్త్రాలతో సత్కరించారు. అర్చకుడు  వెంకటనారాయణశర్మ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-31T20:01:54+05:30 IST