Mulugu: సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో కాల్పుల కలకలం..

ABN , First Publish Date - 2021-12-26T17:01:25+05:30 IST

ములుగు జిల్లాలోని వెంకటాపురం 39 సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో కాల్పులు కలకలం రేపాయి. సీఆర్ఫీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్‌ఐ ఉమేష్‌చంద్రపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా అదే

Mulugu: సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో కాల్పుల కలకలం..

ములుగు: ములుగు జిల్లాలోని వెంకటాపురం 39 సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో కాల్పులు కలకలం రేపాయి. సీఆర్ఫీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్‌ఐ ఉమేష్‌చంద్రపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా అదే తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఎస్ఐ ఉమేష్ చంద్ర అక్కడికక్కడే మృతి చెందగా...తమిళనాడుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ స్ఠీఫెన్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానిక కానిస్టేబుళ్లు స్టీఫెన్‎ను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తల, ఛాతీ భాగంలో బుల్లెట్ గాయాలు కావడంతో స్టీఫెన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2021-12-26T17:01:25+05:30 IST