మేడారం శాశ్వత పనులకు ప్రతిపాదనలు తయారు చేయండి

ABN , First Publish Date - 2021-11-21T05:55:23+05:30 IST

మేడారం శాశ్వత పనులకు ప్రతిపాదనలు తయారు చేయండి

మేడారం శాశ్వత పనులకు ప్రతిపాదనలు తయారు చేయండి

అధికారులతో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

ములుగు కలెక్టరేట్‌, నవంబరు 20: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా శాశ్వత పనులు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపా దనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య ఆదేశించారు. మిషన్‌ భగీరథ ఈఈలు, డీఈలు, ప్రత్యేక అధికారులతో ఆయన శనివారం సమావేశమయ్యారు. మేడారం పరిసరాల్లో  ప్రభుత్వ భూమిని గుర్తించి శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు నివేదికలు తయారు చేయాలన్నారు. సమర్థమైన అధికారుల పర్యవేక్షణలో జాతరను విజయవంతంగా నిర్వహిం చేందుకు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, బోర్‌వెల్స్‌, చేతిపంపులు, మరుగుదొడ్లు, ఇన్‌ఫిల్టరేషన్‌, సఫాయి కార్మికుల నియామకం, మిషన్‌ భగీరథ పైపులైన్ల ఏర్పాటు తదితర పనులు చేపట్టాలన్నారు. ఈసమావేశంలో డీఆర్వో రమాదేవి, మిషన్‌ భగీరథ ఈఈ మాణిక్యరావు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-21T05:55:23+05:30 IST