అత్యాధునిక హంగులతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం

ABN , First Publish Date - 2021-06-21T05:44:09+05:30 IST

అత్యాధునిక హంగులతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం

అత్యాధునిక హంగులతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం

హన్మకొండ అర్బన్‌, జూన్‌ 20 : అంతర్జాతీయ ప్రమాణాలు.. అత్యాధునిక హంగుల తో రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్‌ జైలు స్థలంలో 24 అంతస్థులతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప త్రి భవనాన్ని నిర్మించనుంది. దీనికి సీఎం కేసీఆర్‌ సోమవారం భూమిపూజ చేయనున్నారు. ఇందుకోసం 50 మంది రుత్వికులు, సన్నాయి కళాకారులు ఇప్పటికే వరంగల్‌కు చేరుకున్నారు. 20నిమిషాలపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. పూజసామగ్రిని హైదరాబాద్‌ నుం చే తెప్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగే ఈకార్యక్రమానికి ఎంజీఎం నుంచి కేవలం 10మందికే పాసులు అందా యి. మరో 50మంది పాత్రికేయులకు మీడి యా పాసులు జారీ చేశారు. మరో 200 మంది అతిథులకు  పాసులు జారీ చేశారు. 

ఎమర్జెన్సీ సేవలకు ఎయిర్‌ అంబులెన్స్‌లు

ఉత్తర, దక్షిణ భారతదేశానికి వారధిగా ఉన్న వరంగల్‌లో ఈ ఆస్పత్రి ప్రతిష్థాత్మకంగా మారనుంది. సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో 24 అంతస్థులతో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు.ఆస్పత్రిపై అంతస్థులో హెలీ ప్యాడ్‌ కూడా ఉంటుంది. అత్యవసర రోగులకు ఎయిర్‌ అంబులెన్స్‌ ఉపయోగపడనుంది. సు మారు 59 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆస్పత్రిలో 36 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. 2వేల పడకల సామర్థ్యం కలిగినఆస్పత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రా లజీ, ఎండోక్రైనాలజీ, బేరియాట్రిక్‌ సర్జరీ లాం టి 36 సూపర్‌స్పెషాలిటీ సేవలు అందనున్నా యి. కెనడా తరహాలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనిసర్కారు భావిస్తోంది. కెనడా వైద్యవిధానాన్నిఅనుసరించేందుకు నిపు ణులు బృందం ఆ దేశానికి వెళ్లి అధ్యయనం చేయాలని కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు. ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా అవతరించనుంది. 

Updated Date - 2021-06-21T05:44:09+05:30 IST