వరంగల్‌కు ఎయిర్ పోర్ట్ రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-04T18:47:04+05:30 IST

వరంగల్‌కు ఎయిర్ పోర్ట్ రాకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరంగల్‌కు ఎయిర్ పోర్ట్ రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

వరంగల్‌: వరంగల్‌కు ఎయిర్ పోర్ట్ రాకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని ప్రజలంతా అనుకున్నారని కాని అందుకు విరుద్ధంగా జరుగుతుందని మండిపడ్డారు. బయ్యారం హుక్కు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ను టీఆర్ఎస్ అడగదు... బీజేపీ ఇవ్వదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు.కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ పోరాటానికి సిద్ధంగా ఉందని స్సష్టం చేశారు. ఎప్పటికైనా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తామని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మించక పోవటానికి కారణం ప్రైవేటీకరణ చేయడమేనని చెప్పారు. కమీషన్లు వచ్చే పనులు మాత్రం త్వరగా చేస్తారన్నారు. కోచ్ ఫ్యాక్టరీ‌లో కమీషన్లు రావు కాబట్టి టీఆర్ఎస్ అడగదు బీజేపీ ఇవ్వదన్నారు.  పల్లా రాజేశ్వర్‌రెడ్డి సొంత విశ్వవిద్యాలయంపై పెట్టిన శ్రద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై చూపలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2021-03-04T18:47:04+05:30 IST