ఎంఐఎం ఎవరి పేరు చెబితే వారిపై కేసులు: ఎంపీ సోయం

ABN , First Publish Date - 2021-06-21T22:59:36+05:30 IST

ఎంఐఎం ఎవరి పేరు చెబితే వారిపై కేసులు: ఎంపీ సోయం

ఎంఐఎం ఎవరి పేరు చెబితే వారిపై కేసులు: ఎంపీ సోయం

నిర్మల్: భైంసా‌లో ఎంఐఎం గూండాలు ఎవరి పేరు చెబితే వారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యానించారు. అల్లర్లతో ఎలాంటి సంబంధం లేని అమాయక హిందువులపై పీడీ యాక్ట్‌లు నమోదు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల ఓట్ల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం హిందువులకు ఏం జరిగినా స్పందించడంలేదన్నారు. కలెక్టర్లే సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కుతుండటంతో పోలీసులను జీతగాళ్ల కన్నా హీనంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. హిందువులపై పీడీ యాక్ట్‌లు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. టెర్రరిస్టులు, నక్సలైట్ల మాదిరిగా వేధింపులకు గురి చేస్తున్నారని ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. 

Updated Date - 2021-06-21T22:59:36+05:30 IST