రోడ్ల నిర్మాణాల్లో నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శం

ABN , First Publish Date - 2021-12-31T20:37:23+05:30 IST

డోర్నకల్‌ నియోజకవర్గంలో మారుమూల తం డాలు, గ్రామాలు, ప్రతి వీధిలో రోడ్ల వ్యవస్థ అద్భుతంగా ఉందని, రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా అత్యధిక రోడ్ల నిర్మాణాలు నియోజకవర్గంలోనే ఉన్నాయని మహబూబాబాద్‌ ఎంపీ..

రోడ్ల నిర్మాణాల్లో నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శం

ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

మరిపెడ, డిసెంబరు 30 : డోర్నకల్‌ నియోజకవర్గంలో మారుమూల తం డాలు, గ్రామాలు, ప్రతి వీధిలో రోడ్ల వ్యవస్థ అద్భుతంగా ఉందని, రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా అత్యధిక రోడ్ల నిర్మాణాలు నియోజకవర్గంలోనే ఉన్నాయని మహబూబాబాద్‌ ఎంపీ మాలో తు కవితా, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎ్‌స.రెడ్యానాయక్‌ అన్నారు. గురువారం మునిసిపాలిటీ కేంద్రంలోని నేతావత్‌ తండా వద్ద చిన్నగూడురు మండలంలోని విస్సంపల్లి నుంచి వయా సాయిబాబా దేవాలయం నుంచి మరిపెడ వరకు ఎంపీ నిధులతో రూ 6కోట్ల 30 లక్షల వ్యయంతో 9.80కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న డబుల్‌ రోడ్డు పనులకు శం కుస్థాపన చేశారు. ముందుగా సాయిబాబా దేవాలయలంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధే ధ్యేయమని, అందులో భాగంగానే డివిజన్‌ వ్యాప్తంగా రోడ్లు ప్రతి గ్రామానికి వేయించామన్నారు. త్వరలోనే అన్ని గ్రామాలను కలిపే లింక్‌ రోడ్లను కూ డా బాగు చేస్తామని ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ గుగులోతు సింధూరకుమారి రవినాయక్‌, ఎంపీపీ గుగులోతు అరుణారాంబాబు, జడ్పీటీసీ తేజావత్‌ శారదరవీందర్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్‌ ఎంపీపీ గాదె అశోక్‌రెడ్డి,గుగులోతు వెంకన్న, కుడితి మహేందర్‌రెడ్డి, రేఖ లలితవెంకటేశ్వర్లు, విసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి, నారెడ్డి సుదర్శన్‌రెడ్డి, వుప్పల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T20:37:23+05:30 IST