ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.10 లక్షలిస్తే ఎంపీగా రాజీనామా చేస్తా:కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2021-08-27T10:19:22+05:30 IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.10 లక్షలిస్తే ఎంపీగా రాజీనామా చేస్తా:కోమటిరెడ్డి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.10 లక్షలిస్తే ఎంపీగా రాజీనామా చేస్తా:కోమటిరెడ్డి

యాదాద్రి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తన నియోజకవర్గమైన భువనగిరి పార్లమెంట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తే, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, దీంతో పాటు రాజకీయాల నుంచీ తప్పుకుంటానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. సీఎం కేసీఆర్‌ ఇంటింటికీ రూ.10 లక్షలు, కిలో బంగారం ఇచ్చినా టీఆర్‌ఎ్‌సకు ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్‌తండాలో గురువారం నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడారు. ‘‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కడుంది? 80 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేబినెట్‌లో ఎన్ని మంత్రిపదవులు ఇచ్చారు?’’ అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎ్‌సను స్థాపించిన నాటి నుంచి దళితులను కేసీఆర్‌ మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో దళితుల ఓట్ల కోసమే ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఎన్నికల తర్వాత ఈ పథకం ఉండదని తెలిపారు. ఉద్యోగులకు జీతాల్లేవని కోకాపేటలో భూములు అమ్మిన సీఎం.. రూ.2 లక్షల కోట్లు ప్రజలకు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.

Updated Date - 2021-08-27T10:19:22+05:30 IST