రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌పై కేసు

ABN , First Publish Date - 2021-07-25T05:12:09+05:30 IST

రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌పై కేసు

రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌పై కేసు


హన్మకొండ రూరల్‌, జూలై 24 : రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌, మరో ఇద్దరిపై హన్మకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ రాఘవేందర్‌ శనివారం తెలిపా రు. అల్లూరి ట్రస్ట్‌లో నిధులను దుర్వినియోగం చేసి సభ్యులను మోసం చేశారని ఆరోపిస్తూ మల్లారెడ్డి అనే వ్యక్తి కోర్టు ద్వారా ఫిర్యాదు చేశారని దీంతో ఎంపీతోపాటు చార్టర్డ్‌ అకౌంటెంట్లు అట్టలూరి సత్యనారాయణ, అట్టలూరి వంశీధర్‌పై కేసు నమో దు చేసినట్లు సీఐ తెలిపారు. సీఐ రాఘవేందర్‌ కథనం ప్రకా రం.. హన్మకొండ హంటర్‌ రోడ్‌లోని న్యూశాయంపేటలో గల అల్లూరి ట్రస్ట్‌, అల్లూరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌ సెక్రటరీగా ఎంపీ బండా ప్రకాశ్‌ వ్యవహరిస్తున్నారు. కాగా, 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో ఫైల్‌ చేసిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విషయంలో ఎంపీ ప్రకాశ్‌.. ఇద్దరు చార్టర్డ్‌ అకౌంటెంట్లతో కుమ్మక్కై రూ.12,21,912 నిధులను దుర్వినియోగం చేసినట్లు మల్లారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారిపై ఐపీసీ 409, 417, 120బీ, సీఆర్‌పీసీ 156(3) సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-07-25T05:12:09+05:30 IST